అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూఏ), స్వీడన్‌లోని బ్లీకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉమ్మడిగా నిర్వహిస్తున్న బీటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. మొదటి మూడేళ్లు అనంతపురం జేఎన్‌టీయూలో, చివరి ఏడాది బ్లీకింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదవాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌లో మూడు స్పెషలైజేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కోదానికి 10 సీట్లు కేటాయించారు. నిబంధనల ప్రకారం ప్రోగ్రామ్ పూర్తిచేసినవారు జేఎన్‌టీయూఏ నుంచి బీటెక్ డిగ్రీని, బీటీహెచ్ నుంచి బీఎస్ డిగ్రీని పొందవచ్చు. అభ్యర్థులు కోర్సు మధ్యలో వైదొలగే వీలు లేదు. బీటెక్ పూర్తయ్యాక జేఎన్‌టీయూఏలోగానీ, బీటిహెచ్‌లోగానీ పీజీ అడ్మిషన్ తీసుకోవచ్చు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం మరో ఏడాదిపాటు స్వీడన్‌లో రెసిడెన్స్ పర్మిట్ ఇస్తారు.
అర్హత: తెలుగు రాష్ట్రాల ఇంటర్ బోర్డ్‌లు/ సీబీఎ్‌సఈ/ ఐసీఎ్‌సఈ నుంచి మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 70 శాతం మార్కులు లేదా పది పాయింట్ల స్కేల్ మీద ఏడు పాయింట్ల గ్రేడ్ సాధించి ఉండాలి. ఇంగ్లీష్ మినహా ఇతర మాధ్యమాల్లో చదివిన అభ్యర్థులు బీటీహెచ్‌లో చేరేనాటికి ఐఈఎల్‌టీఎస్/ టోఫెల్ అర్హత పొందాల్సి ఉంటుంది. టోఫెల్‌లో పేపర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే రిటెన్ టెస్ట్‌లో 4.5, మొత్తమ్మీద 575 స్కోర్ రావాలి. ఇంటర్నెట్ బేస్డ్ ఎగ్జామ్ అయితే రిటెన్ టెస్ట్‌లో 20, మొత్తమ్మీద 90 స్కోర్ రావాలి. ఐఈఎల్‌టీఎస్ ఎగ్జామ్‌లో మొత్తమ్మీద 6.5 స్కోర్ ఉండాలి.
ఎంపిక: నిర్దేశిత ప్రాధాన్య క్రమాన్ని అనుసరించి జేఈఈ మెయిన్ 2021, ఏపీ ఈఏపీసెట్ 2021, టీఎస్ ఎంసెట్ 2021, ఇంటర్/ తత్సమాన పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్పెషలైజేషన్‌లు:
మెకానికల్ ఇంజనీరింగ్
ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.1500
పోస్ట్ ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: నవంబరు 29
బీటీహెచ్, జేఎన్‌టీయూఏ ఆఫీషియల్స్‌తో ఇంటరాక్షన్ మీటింగ్: నవంబరు 30
అడ్మిషన్ కౌన్సెలింగ్: డిసెంబరు 1
ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఓరియంటేషన్ మీటింగ్: డిసెంబరు 3
చిరునామా: రిజిస్ట్రార్ కార్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, అనంతపురం.
వెబ్‌సైట్: jntua.ac.in