November 14, 2018

ఏపీ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల - ఫిబ్ర‌వ‌రి 27 నుంచి ప‌రీక్ష‌లు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌‌మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు.  ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌స్టియ‌ర్  , సెకండియ‌ర్ ప‌రీక్ష షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. మొత్తం 1448 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. వివ‌రాలు చూద్దాం.

ప్ర‌థ‌మ / ద‌్వితీయ సంవ‌త్స‌రం ఇంట‌ర్‌:

ఇంట‌ర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16వరకు ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఫిబ్రవరి 28 నుంచి మార్చి18 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఫ‌లితాలు:

పరీక్షలు ముగిసిన 22 రోజుల్లోపు ఫలితాలను వెల్ల‌డించాల‌ని ఏపీ నిర్ణ‌యించింది. మొత్తం 10.64లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించి ఫలితాను వెల్లడిస్తారు. సెంటర్లకు దారి తెలిపేలా యాప్‌ను విద్యార్థులకు పంపిస్తారు.

No comments:

Post a Comment