December 4, 2018

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం (డిసెంబర్‌ 3) తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం కాలపట్టికను విడుదల చేసింది.

 మార్చి 29వ తేదీతో ప్రధాన పరీక్షలు పూర్తవుతుండగా ఏప్రిల్‌ 2తో పరీక్షలన్నీ ముగుస్తాయి. చివరి మూడు పరీక్షలు ఓరియంటల్‌ విద్య, ఒకేషనల్‌ కోర్సుకు సంబంధించినవి. 

కొన్ని పరీక్షలు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12.15గంటల వరకు, మరికొన్ని పరీక్షలు మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ పేపర్‌(పార్ట్‌-బి)ను చివరి అరగంటలో మాత్రమే ఇస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సుధాకర్‌ తెలిపారు.

 ఈసారి సుమారు 5.40 లక్షల మంది పరీక్షలకు హాజరవుతారు. ఏపీలో ఈ ఏడాది మార్చి 18న ప్రారంభమై ఏప్రిల్‌ 2న ముగియనున్నాయి.  


Related Posts



No comments:

Post a Comment