January 9, 2019

ఏపీ మోడ‌ల్ స్కూళ్ల‌లో ఆరో త‌ర‌గ‌తి అడ్మిష‌న్లు 2019-20

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మోడ‌ల్ స్కూళ్ల‌లో ఆరో త‌ర‌గ‌తిలో అడ్మిష‌న్ల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఏపీలో మొత్తం 164 ఆద‌ర్శ పాఠ‌శాల‌లు ఉన్నాయి. వీటిలో 2019-20 సంవ‌త్స‌రానికిగాను ఆరో త‌ర‌గ‌తిలో ప్ర‌వేశానికి విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఆరో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు అర్హ‌త‌:

విద్యార్థులు 2018-19 విద్యా సంవ‌త్స‌రంలో 5వ త‌ర‌గ‌తి చ‌ద‌వి పై త‌ర‌గ‌తికి అనుమతి / ప‌్ర‌మోష‌న్ పొంది ఉండాలి. అభ్య‌ర్థి చ‌దువుకున్న సంబంధిత జిల్లాల్లో ప్ర‌భుత్వ లేదా ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన పాఠ‌శాల‌ల్లో ఎలాంటి గ్యాప్ లేకుండా 2017-18, 2018-19 విద్యా సంవ‌త్స‌రాలు చ‌దివుండాలి.

వ‌యోప‌రిమితి:

ఓసీ, బీసీ కులాల‌కు చెందిన విద్యార్థులు 01 సెప్టెంబ‌రు 2007 నుంచి 31 ఆగ‌స్టు 2009 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కులాల‌కు చెందిన విద్యార్థులు 01 సెప్టెంబ‌రు 2005 నుంచి 31 ఆగ‌స్టు 2009 మ‌ధ్య పుట్టి ఉండాలి.

ప్ర‌వేశ ప‌రీక్ష తేది:

ప్ర‌వేశ ప‌రీక్ష 01.04.2019న జ‌రుగుతుంది.
ప‌రీక్ష స‌మ‌యం: ఉద‌యం 9-00 గంట‌ల నుంచి 11-00 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

ప‌రీక్ష కేంద్రం:
ఏ మండ‌లంలో ఆద‌ర్శ పాఠశాల ప‌నిచేస్తోందో ఆ పాఠ‌శాల‌లోనే  ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప్ర‌వేశ‌ ప‌రీక్ష అయిదో త‌ర‌గ‌తి స్థాయిలో తెలుగు / ఇంగ్లిషు మాధ్య‌మాల్లో ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం:
అభ్య‌ర్థులు ఆన్‌లైన్లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ముంద‌గా ప‌రీక్ష రుసుం చెల్లిస్తే ఒక జ‌న‌ర‌ల్ నెంబ‌ర్ కేటాయిస్తారు. దీన్ని ఉపయోగించి ఇంట‌ర్‌నెట్ లేదా కేంద్రాల్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ప‌రీక్ష ఫీజు: ఓసీ, బీసీల‌కు రూ.100; ఎస్సీ, ఎస్టీల‌కు రూ.30.
ప‌రీక్ష రుసుం చెల్లింపు తేదీలు: 10.01.2019 నుంచి 11.02.2019 వ‌ర‌కు.
వెబ్‌సైట్‌: https://apms.ap.gov.in/apms/

No comments:

Post a Comment