January 9, 2019

తెలంగాణ గురుకుల కాలేజీల్లో ఇంట‌ర్ ఫ‌స్టియర్ అడ్మిషన్లు 2019-20

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ (తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ) ఆధ్వ‌ర్యంలో తెలంగాణ‌లో వివిధ జిల్లాల్లో ఉన్న గురుకుల జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో 2019-20 సంవ‌త్స‌రానికి ఇంట‌ర్లో అడ్మిష‌న్ల‌కు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. విద్యార్థులు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఇత‌ర వివ‌రాలు:
తెలంగాణ గురుకులాలు - ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి ఏడాది ప్ర‌వేశాలు:

ప్ర‌వేశాల‌ను నిర్వ‌హిస్తున్న కాలేజీలు:
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల‌ సైనిక్ జూనియ‌ర్ కాలేజీ, నాన్‌-స్పెష‌లైజ్డ్‌, వొకేష‌నల్ జూనియ‌ర్ క‌ళాశాల‌లు.

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హ‌త‌:
రెగ్యుల‌ర్ ప‌ద్ధ‌తిలో మార్చి - 2019లో ప‌దోత‌ర‌గ‌తి / సీబీఎస్ఈ/ ఐసీఎస్ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకానున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హ‌లు.
ఎంపిక‌:
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించే ప‌్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్ర‌వేశ ప‌రీక్ష తేది: 17 ఫిబ్ర‌వ‌రి 2019.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తు తేదీలు:
09 జ‌న‌వ‌రి 2019 నుంచి 23 జ‌న‌వ‌రి 2019 వ‌ర‌కు.
వెబ్‌సైట్‌: http://www.tswreis.in/

No comments:

Post a Comment